IPS ఆఫీసర్ పోస్ట్.. ఫన్నీ వైరల్ : ఈ బుజ్జాయిలు ఫేక్ న్యూస్ పై డిస్కస్ చేస్తున్నారు

dspసమయస్ఫూర్తితో అప్పటికప్పుడు స్పందించటంతోపాటు కంటెంట్ పై అవగాహన ఉంటే చాలు.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అందులోనూ ఓ సెలబ్రిటీ అయితే చాలు.. మరింత ఉత్సాహంగా షేర్స్, లైక్స్ వచ్చి పడతాయి. అంతేకాదండీ.. అదేస్థాయిలో ప్రజల్లో చర్చ కూడా జరుగుతుంది. కొన్ని సార్లు విషాధాలకు దారి తీసినా.. ఎక్కువ సార్లు మాత్రం మంచి విషయాలే త్వరగా ప్రజల్లోకి వెళతాయి. అలాంటి ప్రయత్నమే చేశారు ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేష్. ఆయన చేసిన ఓ ఫన్నీ ట్విట్ ఇప్పుడు చక్కర్లు కొట్టేస్తోంది.

ఈస్ట్ జోన్ డీసీపీ అయిన ఎం.రమేష్ దృష్టికి వచ్చిన ఓ ఫొటోకు ఆయన పెట్టిన క్యాప్షన్ చాలా ముచ్చటగా ఉంది. ఓ పార్క్ లోని ప్లే జోన్ ఏరియాలో నలుగురు చిన్న పిల్లలు (చాలా ముద్దుగా ఉన్నారు) ఒకేచోట ఉంటారు. పిల్లల ముఖాలు కూడా చాలా సీరియస్ గా ఉంటాయి. ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు అన్నట్లుగా వారిని చూస్తే తెలుస్తోంది. నలుగురు పెద్దలు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో.. ఈ పిల్లలు అలాగే ఉన్నారు. ఓ పిల్లోడు చేతులు వెనక్కి పెట్టుకుని మాట్లాడుతుంటే.. మరో చిన్నారి కిందకి చూస్తూ వింటుంటాడు.. మరో బుజ్జాయి ఏం చేద్దామా అన్నట్లు.. మరో పిడుగు అయితే వారినే చూస్తూ ఉండటం.. నలుగురు నాలుగు రకాల హావభావాలతో ముచ్చటగా ఉంది ఈ ఫొటో.

దీనికి ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేష్ పెట్టిన క్యాప్షన్ ఏంటో తెలుసా.. ఫేక్ న్యూస్, రూమర్స్ పై ఈ పిల్లలు చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలి.. ఎలా అడ్డుకట్ట వేయాలి అని. ప్రస్తుతం సమాజంలో భయాందోళనలు రేకెత్తిస్తున్న అంశం ఇదే. అదే విధంగా వీటిని కంట్రోల్ చేయటానికి పోలీసులు చేస్తున్న కృషికి తగ్గట్టుగా ఉన్న ఈ క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates