మైనర్‌పై లైంగికదాడి కేసులో IPS ఆఫీసర్‌పై FIR

అసోం: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే దారుణ సంఘటనకు ఒడిగట్టాడు. IPS ఆఫీసర్ అయి ఉండి 15 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేసి.. సమాజం సిగ్గుపడేలా చేశాడు.  స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌ లాంగ్ లో జరిగింది. 2012 బ్యాచ్‌కు చెందిన IPS ఆఫీసర్ ఉపాధ్యాయ.. 2019 జనవరి 22 నుంచి కర్బీఅంగ్‌ లాంగ్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

డిసెంబర్ -31న పోలీసులు ఏర్పాటు చేసుకున్న  ఓ పార్టీకి సీనియర్ లేడీ పోలీస్ ఆఫీసర్ తన కూతురు(15)ని తీసుకుని వచ్చింది. లేడీ పోలీస్ ఆఫీసర్ కూతురిపై కన్నేసిన  గౌరవ్ ఉపాధ్యాయ్  … బలవంతంగా బాలికను ఓ రూమ్ లోకి లాక్కెల్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్పీ గౌరవ్‌ ఉపాధ్యాయ్‌ పై పోస్కో చట్టం సెక్షన్‌ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీస్‌ కమిషనర్‌ ఎంపీ గుప్తా.  గౌరవంగా డ్యూటీ చేయాల్సిన పోలీసు ఆఫీసరే ఇలా నీచంగా ప్రవర్తించడంతో.. కంచే చేను మేసిన చందంగా ఉందంటూ తిట్టిపోస్తున్నారు స్థానికులు. బాలికను హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపిన పోలీసులు.. విచారణ వేగవంతం చేస్తామని తెలిపారు.

Latest Updates