తండ్రి చనిపోయి నెలైంది: వైద్యం చేయిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్

చనిపోయిన తన తండ్రి శవానికి ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నాడు మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్. రాజేంద్ర కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ తండ్రి కేఎమ్ మిశ్రా(84) గత నెల 13న చనిపొయారు. గత కొంత కాలంగా.. మిశ్రా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. జనవరి 13న మిశ్రా సిక్ అవడంతో హాస్పిటల్ లో చేర్చారు. మరుసటిరోజు ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పారు. డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.

తన తండ్రి మృత దేహాన్ని రాజేంద్ర కుమార్ తన బంగ్లాకు తీసుకువచ్చి ఆయుర్వేద వైద్యం చేయిస్తున్నారు రాజేంద్ర కుమార్. వారు ఉంటున్న స్ట్రీట్ లో రాష్ట్ర మంత్రులు, పోలీస్ ఉన్నతాదికారులు ఉన్నారు. ఇటీవల అక్కడికి ఆర్మడ్ ఫొర్స్ వేరే పనులపై వెళ్లడంతో.. విషయం బయటకు వచ్చింది. దీంతో మీడియా అక్కడికి చేరుకుని రాజేంద్ర కుమార్ ను ప్రశ్నించగా.. తన తండ్రి ఆయుర్వేద వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ల గురించి తాను మాట్లాడబోనని అన్నారు. తన తండ్రిని చూసేందుకు మాత్రం మీడియాను అనుమతించలేదు రాజేంద్ర కుమార్.

Latest Updates