ఇరాన్​ను వణికించిన భూకంపం.. తీవ్రత 5.1గా నమోదు

టెహ్రాన్: ఇరాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1 గా నమోదైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భూమి ఒక్కసారిగా కంపించడంతో చాలామంది జనం ఇళ్లు వదిలి పరుగులు తీశారు. అనేక మందికి గాయాలవగా.. ఒకరు చనిపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. భూకంపం ధాటికి ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. టెహ్రాన్‌కు ఈశాన్య దిశలో 55కి.మీ దూరంలో ఉన్న దమావాండ్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

 

Latest Updates