
టెహ్రాన్: ఢిఫెన్స్కాంట్రాక్టర్ ముసుగులో గూఢచర్యం చేస్తున్న అమెరికన్ఏజెంట్ జలాల్హాజి జవార్కు ఇరాన్మరణశిక్ష విధించింది. మిలిటరీ కోర్టులో నిందితుడు తప్పును ఒప్పుకోవడంతో శిక్ష విధించి, అమలు చేసింది. ఈమేరకు సెమీ అఫీషియల్న్యూస్ఏజెన్సీ ఐఎస్ఎన్ఏ శనివారం వెల్లడించింది. అమెరికన్గూఢచర్య సంస్థ సీఐఏ ఆఫర్చేసిన డబ్బుకు లొంగి ఇరాన్ సైనిక రహస్యాలను జవార్అమెరికాకు చేరవేశాడని తెలిపింది. జవార్మాజీ భార్య కూడా ఇదే కేసులో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తోందని పేర్కొంది. అయితే, జవార్ను ఎప్పుడు అరెస్టు చేశారు, విచారణ ఎన్నడు జరిగింది, శిక్ష ఎక్కడ అమలు చేశారనే వివరాలను సైన్యం వెల్లడించలేదని ఐఎస్ఎన్ఏ పేర్కొంది. దేశంలో అమెరికా గూఢచర్య నెట్వర్క్ను నాశనం చేశామని ఇరాన్ప్రకటించిన మరుసటి రోజే జవార్మరణశిక్ష విషయం బయటికి పొక్కడం గమనార్హం.