ఇరాన్‌ భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలి: వొలోదిమిర్ జెలెన్ స్కీ

ఉక్రెయిన్ బోయింగ్ విమానం కూలిపోయిన ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ జరపాలని.. దీనికి కారకులైనవారిని చట్టం ముందు నిలబెట్టాలన్నారు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ. దౌత్య మార్గాల ద్వారా అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  అంతేకాదు జరిగిన దానికి భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలని అన్నారు.

ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం తమ వల్లే కూలిపోయిందని… అయితే, కేవలం మానవ తప్పిదం కారణంగానే అది జరిగిందని ఇరాన్ ప్రకటించింది. దీనిపై స్పందించిన వొలోదిమిర్ జెలెన్ స్కీ .. ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా విచారణను ఇరాన్ కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు చెందిన ఎంక్వైయిరీ టీం ఇప్పటికే ఇరాన్ లో ఉందని చెప్పారు. 45 మంది నిపుణలతో కూడిన తమ టీమ్ కు ఇరాన్ సహకరించాలని, వారికి కావాల్సిన అన్నింటినీ అందుబాటులో ఉంచాలని కోరారు జెలెన్ స్కీ.

 

 

Latest Updates