కరోనా వైరస్ సోకిన మహిళా ఎంపీ మృతి

కరోనా వైరస్ సోకి మహిళా ఎంపీ మృతి చెందింది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియాలలో కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఇరాన్ లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

ఇరాన్ లో ఇప్పటి వరకు 4,747మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ అధికార వర్గాలు చెబుతున్నాయి. వైరస్ ధాటికి శుక్రవారం మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ మృతి చెందగా శనివారం.. కన్జర్వేటివ్ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యురాలు ఫతేమహ్ రహబర్ మరణించినట్లు మీడియా సంస్థ తస్నమ్ ప్రకటించింది.

ఇదిలా ఉంటే మార్చి 2న మీడియా సంస్థ తస్నమ్ ఓ కథనాన్ని ప్రచురించింది.  పార్లమెంట్, గార్డియన్ కౌన్సిల్ మధ్య ఎన్నికల సమస్యల్ని పరిష్కరించే ఎక్స్పెడియెన్సీ కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ మిర్మోహమ్మది కరోనా సోకి మరణించినట్లు చెప్పిన తస్నమ్ ..ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఇరాజ్ హరిర్చి, మరో ఎంపీ మహమూద్ సడేఘీ కూడా ఈ వైరస్ బారిన పడ్డారని తెలిపింది.

Latest Updates