ఒకే కాన్పులో ఏడుగురు : సిజేరియన్ లేకుండా పుట్టారు

కవలలంటే ఇద్దరు. ఇదే ముగ్గురయితే ట్రిప్లెట్స్. మరి ఏడుగురయితే సెప్టులెట్స్! ఏంటి ఏడుగురా అని ఆశ్చర్యపోవద్దు. ఇదిగో ఈ ఫొటోలో ఉన్న బుజ్జిపాపలందరూ ఒకేసారి జన్మించినవాళ్లే. ఇరాక్ లోని దియాలాలో ఉన్న ఓ హస్పిటల్ లో  పాతికేళ్ల మహిళ ఈ ఏడుగురికి జన్మనిచ్చారు. వాళ్లలో ఆరుగురు అమ్మాయి లు, ఒక అబ్బాయి ఉన్నారు. సిజేరియన్ తో పని లేకుండా సుఖ ప్రసవం జరిగినట్లు తెలిపారు డాక్టర్లు.  తల్లితో పాటు పిల్లల ఆరోగ్యం కూడా బాగున్నట్లు చెప్పారు.

ఓ తల్లికి ఏడుగురు బిడ్డలు కలగడం ఇరాక్ చరిత్రలో ఇదే తొలిసారి. పిల్లల తండ్రి యూసఫ్ ఫదిల్ మాట్లా డుతూ.. ఏడుగురు బిడ్డల రాకతో తమ సంతానం మొత్తం పదికి పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. 1997లో తొలిసారి అమెరికాలోని ఐయోవా రాష్ట్రానికి చెందిన కెన్నీ, బాబీ దంపతులకు సెప్ట్యులెట్స్ జన్మించారు. ఇటీవల లెబనాన్ లో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. వీళ్లలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు.

Latest Updates