IRCTC కేసులో లాలూకు తాత్కాలిక బెయిల్

IRCTC స్కామ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు జనవరి 19 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ కు ఐఆర్ సీటీసీ కేసులో బెయిల్ వచ్చింది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణను జనవరి 19కి పటియాల హౌజ్ కోర్టు వాయిదా వేసింది. నవంబర్ 19న జరిగిన విచారణలో లాలూను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేలా చూడాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది.

జైళ్లో ఉన్నా, హాస్పిటల్ లో ఉన్నా వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఆ మేరకు ఇవాళ(గురువారం) కేసు విచారణను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది.  IRCTC స్కాం కేసులో లాలూ భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ కు అక్టోబర్ లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు లాలూ దరఖాస్తు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి సమాధానం ఇవ్వాల్సిందిగా సీబీఐ,ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ)లను కోర్టు ఆదేశించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్ సీటీసీ హోటల్స్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ,ఈడీ అతని పై కేసులు నమోదు చేశాయి.

 

Posted in Uncategorized

Latest Updates