రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ తమ వెబ్ సైట్ నుంచి రైలు టికెట్ బుక్ చేసుకునే ప్యాసింజర్స్ కు బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే ఛాన్స్ ఇచ్చింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్ లో కాకుండా వేరే చోట  రైలు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బోర్డింగ్ మార్చుకునే ఆప్షన్ ను ఐఆర్ సీటీసీ లేటెస్ట్ గా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛాన్స్ కేవలం ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే కల్పించింది. దీని కోసం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఐడి పాస్ వర్డ్ లాగిన్ అయి బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్లి రైలు  సెలక్ట్ చేసుకుని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాలి.

Latest Updates