ఏప్రిల్ 30 వ‌ర‌కు ఆ రైళ్లు ర‌ద్దు.. బుకింగ్ చేసుకున్నోళ్ల‌కు ఫుల్ రీఫండ్

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ రైల్వే కేట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల 14 వ‌ర‌కు మాత్ర‌మే లాక్ డౌన్ అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ త‌మ ఆధ్వ‌ర్యంలో న‌డిచే మూడు ప్రైవేటు రైళ్ల‌ను ఏప్రిల్ 30 వ‌ర‌కు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌తంలో ఏప్రిల్ 14 వ‌ర‌కు బుకింగ్ ర‌ద్దు చేసిన ఈ సంస్థ దానిని ఈ నెల చివ‌రి వ‌ర‌కు పొగిచిస్తున్న‌ట్లు తెలిపింది.

బుకింగ్ చేసుకున్న వారికి డ‌బ్బులు వాప‌స్..

మూడు ప్రైవేటు రైళ్లను ఐఆర్సీటీసీ న‌డుపుతోంది. బిజీ రూట్స్ అయిన ఢిల్లీ – ల‌క్నో, అహ్మ‌దాబాద్ – ముంబైల మ‌ధ్య రెండు తేజ‌స్ రైళ్ల‌ను, ఇండోర్ – వార‌ణాశి మ‌ధ్య కాశీ మ‌హాకాళ్ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను ఆప‌రేట్ చేస్తోంది. ఈ రైళ్ల‌కు ఏప్ర‌ల్ 15 నుంచి 30 వ‌ర‌కు ర‌ద్దు చేస్తున్నామ‌ని, వీటికి టికెట్ల బుకింగ్ ను నిలిపేస్తున్నామ‌ని తెలిపింది ఐఆర్సీటీసీ. అయితే ఇప్ప‌టికే టికెట్లు రిజ‌ర్వేష‌న్ చేసుకున్న వారికి డ‌బ్బులు ఎటువంటి క‌టింగ్ లేకుండా పూర్తిగా రీఫండ్ చేస్తామ‌ని వెల్ల‌డించింది.

కాగా, ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే లాక్ డౌన్ ను కొన‌సాగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. దీని ఇంకా కేంద్ర ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ మ‌రికొన్ని వారాలు పొడిగించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతోంది.

Latest Updates