10 రైల్వే స్టేషన్లలో వాటర్​ ప్లాంట్ల సీజ్‌‌

హైదరాబాద్​, వెలుగు:  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న రాష్ట్రంలోని 10 రైల్వే స్టేషన్లలో వాటర్​ ప్లాంట్లను ఇండియన్​ రైల్వే కేటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ లిమిటెడ్​ (ఐఆర్​సీటీసీ) అధికారులు సీజ్‌‌ చేశారు. లైసెన్స్​ ఫీజు చెల్లించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐఆర్​సీటీసీ చెబుతుండగా, తమ డబ్బులే ఐఆర్​సీటీసీ దగ్గర అదనంగా అడ్వాన్స్​ ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వివాదం మధ్య ప్రయాణికులు నలిగిపోతున్నారు. నీళ్లు దొరక్క రూ.20 పెట్టి లీటర్​ బాటిళ్లను కొనుక్కోవాల్సి వస్తోంది. రైల్వే స్టేషన్లలో తాగునీటిని అమ్మేందుకు వాటర్​ వెండింగ్​ మెషీన్లు పెట్టుకునేందుకు ఐఆర్​సీటీసీ అనుమతించింది. స్మార్ట్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీ టెండర్​ను దక్కించుకుంది. ఆ కంపెనీ చిన్న వ్యాపారులకు సబ్​ కాంట్రాక్టును ఇచ్చింది. అయితే, కంపెనీ లైసెన్స్​ ఫీజు చెల్లించట్లేదని ఐఆర్​సీటీసీ అంటోంది. గతంలో నోటీసులిచ్చినా స్పందించకపోవడం వల్లే వాటిని సీజ్​ చేస్తున్నట్టు ప్రకటించింది. నెల రోజుల్లో పెండింగ్​ బిల్లులను కట్టకపోతే కొత్త వారికి వాటిని అప్పగిస్తామని తెలిపింది. అయితే, స్మార్ట్​ ఇండియా కంపెనీ మాత్రం తమ డబ్బులే ఐఆర్​సీటీసీ దగ్గర ఉన్నాయంటోంది.

సీజ్‌‌ చేసిన స్టేషన్లివే..

కాచిగూడ, నిజామాబాద్​, కామారెడ్డి, బాసర, మహబూబ్​నగర్​, ఫలక్​నుమ, ఉప్పుగూడ, మలక్​పేట, సీతాఫల్​మండి, కర్నూలు స్టేషన్లలోని మొత్తం 22 వాటర్​ ప్లాంట్లు.

IRCTC officials seized Water Plants in 10 Railway Stations

Latest Updates