అహ్మదాబాద్, ముంబై మధ్య ‘తేజస్’

వచ్చే నెల 17న ప్రారంభం.. 19 నుంచి ట్రైన్ పరుగులు

న్యూఢిల్లీ: ఇండియన్​ రైల్వే నడుపుతున్న ప్రైవేటు ట్రైన్​ తేజస్.. అహ్మదాబాద్, ముంబై మధ్య పరుగులు తీయనుంది. ఢిల్లీ, లక్నో మధ్య ఇప్పటికే తొలి తేజస్​ ట్రైన్​ నడుస్తుండగా.. అహ్మదాబాద్, ముంబై మధ్య రెండో ట్రైన్ త్వరలో ప్రారంభం కానుంది. ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రీమియం ట్రైన్‌ను జనవరి 17న లాంచ్​ చేసే అవకాశం ఉందని, అదే నెల 19 నుంచి కమర్షియల్​ ప్రయాణాన్ని తేజస్​ ప్రారంభిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. వారానికి ఆరు రోజులు ప్రయాణించే ఈ ట్రైన్ ను.. గురువారం మాత్రం మెయింటెనెన్స్ కోసం నిలిపేస్తారు. ఎయిర్​లైన్స్​ మాదిరిగానే ప్రయాణికులకు సకల సౌకర్యాలు ఈ ట్రైన్ లో అందుబాటులో ఉంటాయి.

ఎన్నో స్పెషాలిటీలు..

  • ఏదైనా కారణంతో ఈ ట్రైన్ ఆలస్యమైతే ప్రయాణికులకు నష్టపరిహారం అందిస్తారు. గంటకుపైగా లేట్​ అయితే రూ.100, రెండు గంటలకు పైగా లేట్​ అయితే రూ.250 అందిస్తారు.
  • ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే రూ.25 లక్షల వరకు రైల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. దోపిడీ జరిగి ప్రయాణికులు తమ వస్తువులు, సొమ్మును కోల్పోతే రూ.లక్ష వరకు కాంప్లిమెంటరీ ట్రావెల్​ ఇన్సూరెన్స్ అందిస్తారు.
  • విమానాల్లో మాదిరిగానే ట్రాలీల్లో హైక్వాలిటీ ఫుడ్, బేవరేజస్​ను ప్రయాణికులకు అందిస్తారు. టికెట్​ చార్జ్​లోనే వీటి ధరా కలిపి ఉంటుంది. ఆయా ప్లేస్​ల్లో దొరికే ప్రత్యేక ఫుడ్​ ఐటమ్స్​ను ప్రయాణికులకు అందించేందుకు ఐఆర్ సీటీసీ సన్నాహాలు చేస్తోంది.
  • ప్రతి ప్రయాణికులకు ప్రత్యేకంగా ప్యాకేజ్డ్​ డ్రింకింగ్ వాటర్ అందిస్తారు. దీనికి అదనంగా ప్రతి కోచ్​లోనూ ఒక ఆర్వో వాటర్​ ఫిల్టర్​ను అందుబాటులో ఉంచుతారు.
  • ఆ రూట్​లో నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఫేర్ కు అనుగుణంగానే తేజస్​ రైలులో టికెట్​ చార్జ్ ఉంటుంది. సాధారణ రోజుల్లో శతాబ్ది చార్జే ఉంటుంది. పీక్​ పిరియడ్​లో 20 శాతం అద నంగా, ఫెస్టివల్​ సీజన్​లో 30 శాతం అదనంగా చార్జ్ చేస్తారు.
  • ట్రైన్​ క్యాన్సిల్​ అయితే కన్ఫర్మ్​ అయిన, వెయిటింగ్​ లిస్ట్​ ఈ టికెట్లకు ఫుల్​ రిఫండ్​ ను ఆటోమేటిక్​గా అందిస్తారు. టికెట్​ను క్యాన్సిల్​ చేసుకోవాల్సిన లేదా టీడీఆర్ ను ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు.
  • తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ కోటా ఉండదు. జనరల్, ఫారిన్ టూరిస్ట్ కోటా మాత్రమే ఉంటాయి. ఫారిన్ టూరిస్ట్​ కోటా కింద ఎగ్జిక్యుటీవ్ క్లాస్​లో ఆరు, చైర్​ కార్​ క్లాస్​లో 12 సీట్లు ఫారిన్ టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి.

Latest Updates