జట్టులో బుమ్రా అతి ముఖ్యమైన ఆటగాడు: పఠాన్

హ్యాట్రిక్ సాధించిన భారత్ పాస్ట్ బౌలర్ జస్పీత్ బుమ్రాపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు  ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను పొగడ్తలతో ముంచాడు. బుమ్రా ఇండియన్ టీంలో అతి ముఖ్యమైన ఆటగాడని అన్నాడు. బుమ్రా ఇండియాకు ఓ వరం అని..అతను భారత్ తరపున ఆడకపోతే చాలా నష్టపోతారని అభిప్రాయపడ్డాడు. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్బుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. బుమ్రా విండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించడం అంత సులువు కాదన్నాడు.. హ్యాట్రిక్ సాధించడం అందరి ఆటగాళ్లకు సాధ్యం కాదన్నాడు. బుమ్రా మరిన్ని హ్యాట్రిక్ లు సాధిస్తాడని..ఇది తన కెరీర్లో ఖచ్చితంగా ఆఖరి హ్యాట్రిక్ మాత్రం కాదని అన్నాడు.  ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ తరపున 2001 లో హర్భజన్ సింగ్, 2006 లో ఇర్పాన్ ఖాన్,2019 లో బుమ్రా హ్యాట్రిక్ సాధించారు.

Latest Updates