‘కెరీర్ కోసం నన్ను పట్టించుకోలేదు’

ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతపా సిక్దర్ లేఖ
న్యూఢిల్లీ: రీసెంట్ చనిపోయిన బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) ను తలచుకుంటూ ఆయన భార్య సుతపా సిక్దర్ రాసిన లేఖ అందరి హృదయాలను కదిలిస్తోంది. సుతపా తను రాసిన లెటర్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. కవితాత్మకంగా, శక్తిమంతమైన పదాలతో ఆమె ఈ లేఖను రాసింది. ‘దీన్ని (ఇర్ఫాన్ మరణం) మొత్తం ప్రపంచం పర్సనల్ లాస్ గా భావిస్తున్నప్పుడు.. ఫ్యామిలీ స్టేట్ మెంట్ అని ఎలా చెప్పగలను? మాతో కలసి లక్షలాది మంది రోదిస్తున్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవడాన్ని నేను ఎలా మొదలు పెట్టగలను? అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇది కోల్పోవడం కాదు. ఆయన నేర్పిన విషయాలను తీసుకోవడమే. దీన్ని నిజంగా అమలుపరచాలి. ఇది అసంభవం కావొచ్చు కానీ ఇర్ఫాన్ మాటల్లో చెప్పాలంటే సంభవమే (మ్యాజికల్). ఆయన వన్ డైమెన్షనల్ రియాలిటీని ఎప్పుడూ నమ్మలేదు. కానీ ఇర్ఫాన్ పై ఒక విషయంలో మాత్రం నాకు పగ ఉంది. జీవితం కోసం ఆయన నన్ను పట్టించుకోలేదు. పర్ఫెక్షన్ కోసం ఆయన పడే తపన ఏ విషయంలోనూ నన్ను సాధారణంగా ఉండనివ్వదు. మాది వివాహం మాత్రమే కాదు ఐకమత్యం కూడా. నా ఫ్యామిలీని ఓ బోటులా చూస్తా. బోటులో బాబిల్, అయాన్ (కొడుకులు) ఇర్ఫాన్ గైడెన్స్ తో సినిమాలా రీటేక్స్ లేని జీవితంలో సేఫ్ గా ప్రయాణిస్తారని ఆశిస్తున్నా’ అని సుతపా హృద్యంగా రాసుకొచ్చింది.

Latest Updates