ఫ్యాషన్ ప్రియుల కోసం కొత్త మ్యాగ్ జైన్

ఫ్యాషన్ ప్రియుల కోసం కొత్త మ్యాగ్ జైన్

ఫ్యాషన్ ప్రియుల కోసం ఎక్స్ క్లూజివ్ మ్యాగ్ జైన్ ను IRFW ప్రారంభించింది. వర్థమాన నటి నక్షత్ర త్రినయిని ఈ మ్యాగ్ జైన్ కవర్ పేజ్ ను ఆవిష్కరించింది.  కేవలం ఫ్యాషన్ కు సంబంధించిన వార్తలే కాకుండా  తెలంగాణాలో ఉన్న టాప్ 100 జిమ్స్ , సెలూన్స్ , రెస్టారెంట్స్ , హోటల్స్ , రిసార్ట్స్ వంటి లైఫ్ స్టైల్ కు సంబంధించి ప్రతీ కంపెనీ వివరాలు ఈ మ్యాగ్ జైన్ ద్వారా అందుబాటులో ఉంచామని ఫౌండర్ , మోడల్ జాన్ పాల్ చెప్పారు. అలాగే మిస్టర్ అండ్ మిస్ ఇండియా ఇంటర్ నేషనల్ రన్ వే మోడల్ రెండో సీజన్ త్వరలోనే జరగనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ కు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. ఈ సీజన్ లో 20 రాష్ట్రాలకు చెందిన మోడల్స్  పాల్గొనబోతున్నారు.