ఇంజినీర్లపై భారం తగ్గించేందుకు 19 సర్కిల్స్‌గా ఇరిగేషన్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు, పంపుహౌస్‌లు అందుబాటులోకి వచ్చినందున కింది స్థాయిలో ఇంజనీరపై ్ల పనిభారం పెరిగిందని, దానికి అనుగుణంగా ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌ మెంట్ ఆర్గనైజేషన్‌‌‌‌పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కింది స్థాయిలో 13గా ఉన్న సర్కిల్స్‌‌‌‌ను 19కి పెంచాలన్నారు. ఒక్కో సర్కిల్‌‌‌‌లోని భారీ ప్రాజెక్టుల నుంచి చెరువులు, చెక్‌‌‌‌డ్యాంలు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, ఐడీసీ లిఫ్టులు, పంపుహౌస్‌లు, కాల్వలు, సబ్‌ స్టేషన్ల పర్యవేక్షణ అధికారం సంబంధిత చీఫ్‌ ఇంజనీర్ ఆధీనంలో ఉంటుందనిచెప్పారు. ఇరిగేషన్‌‌‌ ‌రీ ఆర్గనైజేషన్‌‌‌‌పై మంగళవారం ప్రగతిభవన్‌‌‌‌లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇకపై ఇరిగేషన్ డిపార్ట్‌‌‌‌ మెంట్.. వాటర్‌ రిసోర్సెస్‌గా ఒకే విభాగంగా పనిచేస్తాయన్నారు. పాత సర్కిల్స్‌‌‌‌కు బదులు కొత్తగా ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సర్కిల్స్‌‌‌ ‌ఏర్పాటు చేసి ఒక్కో సర్కిల్‌ ‌‌‌బాధ్యతలు ఒక్కో చీఫ్‌ ఇంజనీర్‌కు అప్పగించాలని కేసీఆర్సూచించారు. ఈ సర్కిల్‌‌‌‌ పరిధిలోని అన్ని నీటి వనరుల పర్యవేక్షణ సీఈ ఆధ్వర్యంలోనే ఉంటుందన్నా రు.

ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం నిరయ్ణించారు. వరంగల్‌ ‌‌‌రూరల్‌‌ ‌‌జిల్లాలోని పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరిం చాలని ఆదేశించారు. 30 వేల ఎకరాల ఆయకట్టును స్టెబిలైజ్‌ చేసేలా పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. కాల్వలు పునరుద్ధరిస్తే కాకతీయుల వారసత్వాన్ని కాపాడుకున్నట్టేనని, వెంటనే ఎస్టిమేట్లు రూపొందించాలన్నారు

Latest Updates