కరోనా భయంతో ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆత్మహత్య

న్యూఢిల్లీ: కరోనా భయంతో ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో 56 ఏళ్ల ఐఆర్ఎస్ ఆఫీసర్ శివరాజ్ తన కారులోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఇన్​కం ట్యాక్స్ విభాగంలో పోస్టింగ్ లో ఉన్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని, తనకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ప్రాణాలు తీసుకున్నాడని సూసైడ్ నోట్ ద్వారా తెలిసినట్లు పోలీసులు వివరించారు. ఈ మధ్యే ఆయన కరోనా టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ… ప్రాణాంతక వైరస్ తన కుటుంబానికి వ్యాపించడం ఇష్టం లేదని, అందుకే చనిపోతున్నట్లు శివరాజ్ సింగ్ నోట్ లో పేర్కొన్నాడని చెప్పారు. శివరాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు.. రిపోర్టు వచ్చిన తర్వాత ఆయన మరణంపై మరింత స్పష్టత రానుందన్నారు.

Latest Updates