బిగ్ బాస్: అంతా ఫిక్సింగేనా?.. ఆడియన్స్ తో ఆటా?

బిగ్ బాస్ షో.. తెలుగు బుల్లి తెరపై ఫాస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న షో.. ప్రేక్షకులు లీనమైపోయి చూస్తున్న టాప్ టీవీ షోల్లో ఇదొకటి. అలాంటి బిగ్ బాస్ షోను అంతా ముందే అనుకున్న ప్రకారంగా పక్కా ప్లాన్ తో నడిపిస్తున్నారా? షో నడుస్తున్న తీరంతా ఫిక్సింగేనా? ఓటింగ్ పేరుతో ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేస్తున్నామంటూ చేస్తున్నది ఉత్త ‘షో’నేనా? టీవీకి అతుక్కుపోయేలా చేయడం కోసం ఆడియన్స్ తోనే బిగ్ బాస్ గేమ్స్ ప్లే చేస్తున్నాడా?

ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు బలపడుతున్నాయి. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేస్తున్న కామెంట్స్ ఓ వైపు ఉంటే… షో చేసే సగటు ప్రేక్షకుడిలోనూ కొన్ని అనుమానాలొస్తున్నాయి. తరచూ ఆడియన్స్ నుంచి వస్తున్న కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎవరికి ఎన్ని ఓట్లు?

ఎలిమినేషన్ కు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కు ఆడియన్స్ ను ఓట్లేయమంటారు. ఏ కంటెస్టెంట్ హౌస్ లో ఉండాలని కోరుకుంటే వారికి సపోర్ట్ ఇవ్వమంటారు. జనాలు వాళ్ల అభిమానాన్ని చూపించుకోవడానికి ఫోన్లు పట్టుకుని ఎస్ఎంఎస్/మిస్డ్ కాల్ ద్వారా ఓట్లేస్తారు. నామినేట్ అయిన వారిలో నుంచి ఒకరు వీకెండ్ లో ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ బిగ్ బాస్ హోస్ట్ చెప్పే మాట.. ఇది ప్రేక్షకుల డెషిషన్ అని! కానీ, ఏ కంటెస్టెంట్ కు ఎన్ని ఓట్లు వచ్చాయన్నది మాత్రం బయటపెట్టరు. ఇలా ఓట్ల సంఖ్య చెప్పకపోవడానికి కారణం.. ఏ కంటెస్టెంట్ ను హౌస్ నుంచి బయటకు పంపాలన్నది బిగ్ బాస్ టీం ముందే ఫిక్స్ చేసుకుని ఉంటుందన్నది ఆరోపణ.

వైల్డ్ కార్డ్ కి బేస్ ఏంటి?

ఓట్ల సంఖ్య చెప్పరు సరే, ఆడియన్స్ ఓట్లతోనే ఎలిమినేట్ చేశామని చెబుతున్న బిగ్ బాస్.. ఏ బేసిస్ తో బయటకు పోయినవారిని మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో లోపలికి తెస్తున్నారు.  దీనికి కూడా ఓటింగ్ పెట్టి ఎక్కువ ఓట్లు వచ్చిన వారినే హౌస్ లోకి రీ ఎంట్రీ చేయించొచ్చు కదా! అని ప్రేక్షకుల డౌటనుమానం.

Latest Updates