అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు బాగా ఇబ్బంది పెడుతున్నరు

అక్కను బాగా ఇబ్బంది పెడుతున్నారన్నారు భూమా అఖిల ప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డి. ఆరోగ్యం బాగా లేకున్నా.. బయబ్రాంతులకు గురిచేయడం బాధించిందన్నారు. ఆ ల్యాండ్ మాదేనన్న ఆయన.. నాన్న ఉన్నప్పటి నుండే లిటిగేషన్స్ ఉన్నాయన్నారు. నాన్న చనిపోయాక గ్రూప్ నడిపించడం మాములు విషయం కాదని.. సీఎం కేసీఆర్ కి విజ్ఞప్తి అన్నారు. మా పేరెంట్స్ చనిపోయినా.. ప్రజల కోసం ఆళ్లగడ్డలో, రాయల సీమలో రాజకీయం చేస్తున్నామన్నారు. ఈ కేసులో మా ఫాలొర్స్ కు సంభంధం లేదన్నారు. మేం విచారణకు సిద్ధమని.. పార్టీ మారాలని మాపై ఒత్తిడే కారణమా..ఇక్కడ ఇంత ఒత్తిడి ఎందుకు అన్నారు జగత్ విఖ్యాత రెడ్డి.

Latest Updates