కరోనాతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మృతి..!

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా సోకి మరణించినట్లు తెలుస్తోంది.

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం బయట ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ కరాచీలో రహస్యంగా జీవిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం కరాచీ ఐఎస్ ఐ స్థావరంలో ఆశ్రమం పొందుతున్న దావూద్ ఇబ్రహీం కు, అతని భార్య మెహజబీన్ కు కరోనా సోకినట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ కథనాలకు ఊతం ఇచ్చేలా ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్..కరోనాతో దావూద్ మరణించారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

దావూద్ మరణంపై నెటిజన్లు మీమ్స్ తో చెలరేగిపోతున్నారు. ప్రపంచ దేశాల నిఘూ వ్యవస్థల కళ్లు కప్పి తప్పించుకొని తిరుగుతున్న దావూద్ కరోనాకు చిక్కాడని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తుంటే

దావూద్ కోసం ప్రపంచ దేశాల్ని గాలిస్తున్న ఇంటర్ పోల్, ఎఫ్ బీఐ, సీఐఏ, రా ఏజెంట్ లు ..దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్లేస్ లో కరోనాకు సెల్యూట్ చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి.

Latest Updates