థామస్‌‌ ఉబెర్‌‌ కప్‌‌ ఆడడం సేఫేనా?: సైనా నెహ్వాల్

హైదరాబాద్‌‌: థామస్‌‌, ఉబెర్‌‌ కప్ ​టోర్నమెంట్స్​ విషయంలో ఇండియా బ్యాడ్మింటన్​ స్టార్ సైనా నెహ్వాల్​ సందేహం వెలిబుచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైమ్​లో ఆ టోర్నీల్లో ఆడడం ఎంతవరకు సేఫ్​ అంటూ ఆదివారం ట్విటర్​ ద్వారా ప్రశ్నించింది. ‘కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా ఏడు కంట్రీలు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. ఇలాంటి తరుణంలో (థామస్​, ఉబెర్​ కప్​ 2020) ఆ టోర్నమెంట్లు ఆడడం ఎంతవరకు సురక్షితం ?’ అంటూ సైనా ట్వీట్​ చేసింది.

Latest Updates