
వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మామిడి, అరటి వంటి కాయలను మగ్గ బెట్టేం దుకు ఇథిఫాన్, ఇథిలీన్ వంటి కెమికల్స్‌ను వాడితే జనం హెల్త్ కు డేంజరా కాదా చెప్పాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కెమికల్స్ తో మగ్గ బెట్టడంపై మూడేండ్ల కిందట పేపర్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్ గా పరిగణించింది. ఇథిలీన్ ప్యాకెట్ల అమ్మకాలపై అధికారులు దాడులు చేయడాన్ని సవాల్ చేస్తూ గోల్డరైప్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్జీఎస్ ఇంటర్నేషనల్ కంపెనీలు రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటన్నింటిపై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డిల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఆ రెండు కెమికల్స్ ను పరిశీలిస్తే వేరువేరు గా ఉన్నట్లు అనిపిస్తోందని, ఎమికస్ క్యూరీ రిపోర్టు తర్వాత ఇథిఫాన్ గురించి తెలిసిందని, వాటి వాడకం వల్ల ప్రజారోగ్యానికి హాని ఉందో లేదో చెప్పాలని ఆదేశించింది. విచారణను 30కి వాయిదా వేసింది.