మాస్క్‌‌తో రిస్క్ ఉందా?

మాస్క్ వేసుకుంటే ఆక్సిజన్ శాతం తగ్గుతుందా. అది అక్కడ ఉండే కార్బన్ డై ఆక్సైడ్‌‌నే పీల్చుకునేలా ఫోర్స్ చేస్తుందా? ఇలాంటి డౌట్స్ ఇటీవల ఎక్కువయ్యాయిసోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్స్  వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో నిజమెంతో ఎవ్వరికీ అంతగా తెలీదు. అయితే దీని గురించి ఎక్స్‌‌పర్ట్స్ కొన్ని విషయాలు చెప్పారు.

  •  మాస్క్‌‌తో  రిస్క్ లేకుండా ఉండాలంటే… కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే మాస్క్ పెట్టుకునే విధానం కూడా సరిగ్గా ఉండాలి.
  • గంటకొకసారైనా మాస్క్ తీసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి.
  • మాస్క్‌‌ను మాటిమాటికి చేతితో తాకకూడదు.
  • వీలైనంతవరకూ సింగిల్ యూజ్ మాస్క్ వాడాలి. లేదా తరచూ దాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి.
  • సర్జికల్ మాస్క్, కాటన్ మాస్క్ లకు బదులు కాస్త మందంగా ఉండే మాస్క్‌‌లు లేదా ఎన్ 95 మాస్క్‌‌లు వాడడం బెటర్.
  • మాస్క్‌‌ను తరచూ మెడ దగ్గర వేలాడదీయడం లాంటివి చేయొద్దు. చేతులకు, శరీరానికి వీలైనంత వరకూ మాస్క్ తాకకపోవడమే మంచిది.

టీవల న్యూ జెర్సీలో ఒకతను కార్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. పోలీసులొచ్చి అడిగితే.. ‘చాలాసేపటి నుంచి మాస్క్ పెట్టుకోవడం వల్ల ఊపిరి సరిగా ఆడక ఇబ్బంది పడ్డాను, అందుకే యాక్సిడెంట్ జరిగింది’ అని చెప్పాడు.  తర్వాత జరిగిన విషయాన్ని ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్ చేస్తే.. సుమారు మూడువేల మంది షేర్ చేశారు. అలా ఆ న్యూస్ అందరికీ చేరి.. మాస్క్ వేసుకుంటే ఆక్సిజన్ శాతం తగ్గుతుందన్న టాపిక్  వైరల్ అయ్యింది. ఇంతకీ మాస్క్ వేసుకుంటే నిజంగా ఆక్సిజన్ శాతం తగ్గుతుందా?

మనం పీల్చుకునే శ్వాసలో ఆక్సిజన్ శాతం తగ్గినా, కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగినా  ఇబ్బందులు తలెత్తడం మాట నిజమే. కానీ మాస్క్‌‌తో అలా జరుగుతుందా అంటే.. అది మాస్క్ తయారయ్యే మెటీరియల్‌‌ను బట్టి ఉంటుందంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్.  సరిగా గాలి చొరబడని మెటీరియల్‌‌తో చేసిన మాస్క్‌‌లు అలాగే మరీ బిగుతుగా పెట్టుకున్న మాస్కులతో కొంతవరకూ ఇబ్బంది ఉండొచ్చంటున్నారు. కానీ మామూలుగా మనం పెట్టుకునే మాస్క్‌‌లతో ఎలాంటి ఇబ్బందీ లేదట. ఎన్ 95 లేదా బయట దొరికే మెత్తటి బట్టతో తయారు చేసిన మాస్క్‌‌లు పూర్తిగా సేఫ్. అయితే  మెటీరియల్ గురించి తెలియక కొంతమంది ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌‌ల వల్ల ఒక్కోసారి ఇబ్బందిగా మారొచ్చు. అందుకే మెడికల్ షాపుల్లో దొరికే మాస్కులు కొనుక్కుంటే బెటర్.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. కార్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పెట్టుకున్న మాస్క్ ఎన్ 95. మరి ఇదెలా ఇబ్బందిగా మారిందంటే.. మాస్క్ ఏదైనా మరీ ఎక్కువ సేపు పెట్టుకోవడం, అలాగే అంతకుముందు శ్వాస సమస్యలు ఉండడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని డాక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా మంచి మాస్క్‌‌ను ఎంచుకోవడం, గంటకొకసారి మాస్క్ తీసి రెండునిముషాల గ్యాప్ ఇవ్వడం లాంటివి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఎక్స్‌‌పర్ట్స్ అభిప్రాయం.

Latest Updates