డల్లాస్ అంటే ఇదేనా కేసీఆర్ ?

కేసీఆర్ ను ప్రశ్నించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ సిటీని డల్లాస్ లాగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని.. ఇదేనా డల్లాస్ అని ప్రశ్నించారు. గురువారం ముషీరాబాద్ డివిజన్ లోని వినోబా నగర్ బస్తీ వాసులకు బియ్యం, వంట సామాన్లను ఆయన పంపిణీ చేశారు.  హైదరాబాద్ లో ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరని లక్ష్మణ్‌‌ ప్రశ్నించారు. నవీన్ గౌడ్, రేవతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.’

 

Latest Updates