వరల్డ్‌ కప్‌ స్టాండ్ బై పేసర్‌ గా ఇషాంత్‌

ముంబై: టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఇంతవరకు ఒక్క వరల్డ్‌ కప్‌ లో కూడా ఆడలేదు. ఈ సారి కూడా ప్రపంచకప్‌ టీమ్‌ లో చోటు దక్కించు కోలేకపోయిన లంబూకు కాస్త ఊరట కలగనుంది.ఇంగ్లండ్‌ లో ఈ నెల 30న మొదలయ్యే వరల్డ్‌ కప్‌ లో పాల్గొనే ఇండియా టీమ్‌ కు అతను స్టాండ్‌ బైగా ఎంపికయ్యాడు. రిషబ్‌ పంత్‌ , అంబటి రాయుడు, నవ్‌ దీప్‌ సైనీలతో కలిసి స్టాండ్‌ బై ప్లేయర్‌ గా ఇషాం త్‌ కూడా ఇంగ్లండ్‌ వెళ్లనున్నాడు. ‘సైనీ మా నంబర్‌ వన్‌ రిజర్వ్‌ సీమర్‌ . సెకండ్‌ ఆప్ష న్‌ గా ఇషాం త్‌ ను ఎంచుకున్నాం. అతనికి ఇంగ్లండ్​లో ఆడిన అనుభవం ఉంది.ఇప్పుడు కూడా అతను బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడ’ని బీసీసీఐ అధికారి ఒకరి తెలిపారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పన్నెండో సీజన్‌ లో ఢిల్లీ క్ యాపిటల్స్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాంత్‌ 10 మ్యాచ్‌ ల్లో 12 వికెట్ల తో సత్తా చాటాడు.

 

Latest Updates