ISI మార్క్ లేని హెల్మెట్ అమ్మితే రెండేళ్ల జైలు

టూ వీలర్ నడిపే వారు ఇకపై హెల్మెట్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధరకు వస్తుందని ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ కొంటే ఇక అంతే సంగతులు..  జనవరి 15,2019 తర్వాత ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లపై కేంద్రం బ్యాన్ విధించనుంది. మరోవైపు జనవరి 15 తర్వాత ఎవరైనా ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ అమ్మితే రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండు లక్షల ఫైన్ పడనుంది.

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక వాహనదారులు ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు కొనేందుకు కేంద్రం రెండు నెలల గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత కూడా ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లు వాడే వారిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates