బీజేపీ లోనే  ISI ఏజెంట్లు: దిగ్విజయ్

పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ ఐ’ నుంచి బీజేపీ, భజరంగ్ దళ్ కు చెందిన కొందరికిడబ్బులు అందుతున్నాయని, ముస్లింల కంటే నాన్ ముస్లింలే ఎక్కువగా ఐఎస్ ఐ తరఫున గూఢచర్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్​ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘భజరంగ్ దళ్ , ఎంపీ బీజేపీ ఐటీ సెల్ కు చెందిన వ్యక్తులపై మధ్యప్రదేశ్​ పోలీసులు ఫైల్ చేసిన కేసుపైనే నేను మాట్లాడా ను తప్ప ఇవి వ్యక్తిగత ఆరోపణలు కావు. వీటిపై మీడియా సంస్థలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు?”అంటూ దిగ్విజయ్ ఆదివారం మరోసారి తన కామెంట్లను సమ ర్థించుకున్నారు. మధ్యప్రదేశ్​లోని సత్నాలో వెలుగు చూసిన టెర్రర్ ఫండింగ్ కేసులో భజరంగ్ దళ్ లీడర్ బలరాం సింగ్ సహా ఐదుగురిని ఆగస్టు 21న ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రెండేండ్ల కిందటి మరో కేసులోనూ బీజేవైఎం నేత ధ్రువ్ సక్సేనా నిందితుడిగా ఉన్నారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ , ఎంపీ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం దిగ్విజయ్ కామెంట్లపై స్పందించారు. వార్తల్లో హెడ్ లైన్లకు ఎక్కడానికే డిగ్గీ ఇలాంటి చీప్ ట్రిక్స్​ చేస్తున్నారని మండిపడ్డారు.

Latest Updates