జైల్లో కొట్లాట..32 మంది మృతి

దుషన్బే (తజకిస్థాన్): తజకిస్థాన్​లోని వాహ్ దాత్​లో జైల్లో చెలరేగిన హింసలో 32 మంది చనిపోయారు. ఇందులో 24 మంది ఐసిస్ తీవ్రవాదులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ‘‘ఆదివారం సాయంత్రం ఖైదీల మధ్య కొట్లాట జరిగింది. ఈ సమయంలో ఐదుగురు ఖైదీలు, ముగ్గురు గార్డులు మృతి చెందారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నిస్తున్న సమయంలో మిగతావారు చనిపోయారు” అని తజకిస్థాన్​న్యాయ మంత్రి ఓ ప్రకటనలో చెప్పారు. ‘‘తొలుత కొందరు ఖైదీలు ముగ్గురు గార్డులను చంపారు. మిగతా వారిని భయపెట్టేందుకు తర్వాత మరో ఐదు మంది ఖైదీలను చంపారు. కొందరు ప్రిజనర్లను బందీలుగా చేసుకున్నారు. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్ నిర్వహించాయి. 24 మందిని కాల్చేశాయి. మరో 35 మందిని అరెస్టు చేశాయి” అని వివరించారు. ఈ జైలులో మొత్తం 1,500 మంది ఖైదీలు ఉన్నారు.

Latest Updates