పోలీసులకు చుక్కలు చూపించిన భారీ పర్సనాలిటీ

లావుగా ఉన్న ఓ వ్యక్తిపై సోషల్ మీడియాలో పేలుతున్న కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల ఇరాక్ లో ఐసిస్ నేత, ప్రభోదకుడు పోలీసులకు దొరికాడు. అయితే అతడు 135 కిలీల బరువుతో భారీ పర్సనాలిటీతో ఉన్నాడు. అతడిని జైలుకు తీసుకెళ్లడానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు. కారులో ఎక్కించేందుకు ఎంత ప్రయత్నించినా అతడి సగ భాగం కూడా పట్టడంలేదు.

దీంతో చేసేదేమిలేక అక్కడి పోలీసులు ఈ భారీకాయుడి కోసం ఏకంగా ఓ ట్రక్కునే తెప్పించారు. చాలామంది వ్యక్తుల సాయంతో అతడిని అతి కష్టంమీద ట్రక్కులో జైలుకు తరలించారు.  ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుండగా .. అతడిపై కామెంట్స్ పేలుతున్నాయి. ఐసిస్‌ నేత స్ధావరం బేకరీ అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్స్ వేసుకుంటున్నారు. మొత్తానికి పోలీసులకు చుక్కలు చూపించావు అంటూ ట్వీట్ వదిలారు.

ఐసిస్‌ ప్రముఖ నేతగా పేరొందిన అతడి పేరు షిఫల్‌ నిమ. అతడు జారీ చేసిన ఫత్వాలు మేథావులు, ఆథ్యాత్మిక వేత్తల హత్యలకు దారితీశాయని ఇరాక్‌ పోలీసులు తెలిపారు. నిమ పట్టుబడటం ఐసిస్‌ కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారన్నారు.

Latest Updates