ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అరెస్ట్….

ఇస్లామిక్ స్టేట్  టాప్ కమాండర్‌ మునిమ్ మహమ్మద్ అఫ్గనిస్తాన్ లో అరెస్ట్ అయ్యాడు.  ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యురిటీ (NDS) బుధవారం తెలిపింది. ఇతను పాకిస్తాన్ ఇంటలీజెన్స్ గ్రూప్, లష్కర్ – ఏ – తోయిబా ఉగ్ర వాద గ్రూపుకు పనిచేసే వాడని NDS చెప్పింది. మహమ్మద్ ఢిల్లీ, కాబూల్ లో టెరర్రరిస్ట్ కార్యకలాపాలు జరిపేందుకు ప్లాన్ వేస్తున్నాడని తెలిపింది. ఇతను పాకిస్తాన్ పౌరుడని …  మొదట అల్ – ఖైదాలో పనిచేశాడని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ తన కేంద్రాన్ని విస్తరించడంలో భాగంగా… మహమ్మద్ ఇతర ఉగ్రవాద గ్రూపులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకునే వ్యక్తిగా నియమించబడ్డాడని చెప్పారు.

మార్చి 25న కాబూల్‌లో సిక్కు ఆరాదన స్థలం గురుద్వారా పై జరిగిన దాడి తర్వాత ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అఫ్గనిస్తాన్ అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో… 25సంవత్సరాల క్రితం అదృష్యమైన ఐజాజ్ అహ్మద్ అహంగర్ కూడా ఉన్నట్లు చెప్పారు. ఆతను జమ్మూ కశ్మీర్ లోని ఇస్లామిక్ స్టేట్‌కు టాప్ రిక్రూటర్‌గా పని చేశారని అన్నారు.

Latest Updates