ఇస్మార్ట్ క్రికెట్ బాల్.. లోపల చిప్

టెక్నాలజీ అంది వచ్చాక క్రికెట్​ స్మార్ట్​ అయిపోయింది. మొన్నటికి మొన్న బ్యాటును తాకితే బంతి బౌండరీ దాటేలా ఆల్గో బ్యాట్​ను తయారు చేశారు. ఇప్పుడు అదే బాటలో కొత్తగా స్మార్ట్​ బాల్​ను సృష్టించారు. ఆస్ట్రేలియాకు చెందిన కూకబుర్రా సంస్థ ఆ బంతిని తయారు చేసింది. మరి, ఆ బంతివల్ల ఉపయోగాలేంటి? అది స్మార్ట్​ బాల్​ ఎందుకైంది? బౌలర్లు తాము వేసిన బంతి స్పీడ్​, లెంగ్త్​, లైన్​, హైట్​ను రియల్​టైంలో తెలుసుకునేలా బంతిలో ఓ మైక్రోచిప్​ను పెట్టారు. ఆ మైక్రోచిప్​ను స్మార్ట్​వాచ్​కు కనెక్ట్​ చేశారు. బంతి రెవల్యూషన్స్​ (బంతి తిరగడం) ఆధారంగా స్మార్ట్​చిప్​ డేటాను తీసుకుంటుంది. బంతి స్పీడు, వదిలేటప్పుడు బంతి ఎత్తు, పిచ్​ అయ్యాక బౌన్స్​ను లెక్కిస్తుంది. ఆ లెక్కలను తెలుసుకునేలా బంతిని వదిలిన వెంటనే బౌలర్​ తాను పెట్టుకున్న స్మార్ట్​ వాచీలో డేటా వస్తుంది. దానికి తగ్గట్టు బౌలర్​ రివ్యూ చేసుకోవచ్చు. దాని వల్ల బౌలింగ్​ తీరును బౌలర్​ మెరుగుపరుచుకునే వీలుంటుంది. సంస్థ రెండేళ్లుగా ఈ స్మార్ట్​ బంతిపై పని చేస్తోంది. ఇప్పటికైతే దానిని టెస్ట్​ చేయలేదు. ఓ పెద్ద దేశవాళీ టీ20 మ్యాచ్​లో పరీక్షించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి ఐసీసీకి, పలు దేశాల క్రికెట్​ బోర్డులకు వాటిని ఇవ్వాలని భావిస్తోంది. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ వాడేందుకు సన్నాహాలు చేస్తోంది.

Latest Updates