ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ నాదే : హీరో ఆకాష్

ismart-shanka-movie-concept-is-mine-says-hero-akash

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్  మెయిన్ కాన్సెప్ట్ తనదే అంటున్నారు  హీరో ఆకాష్. ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో తీసింది ‘ఇస్మార్ట్ శంకర్’ . ఇదే కాన్సెప్ట్ తో  తెలుగు,తమిళ భాషల్లో తన స్టోరీ, స్క్రీన్ ప్లేతో తాను హీరోగా రాధ అనే మహిళా డైరెక్టర్  సినిమా తీశారని అన్నారు.  ఆ సినిమా తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలయ్యిందన్నారు. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్ తో త్వరలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా తమకు ‘ఇస్మార్ట్ శంకర్’  మూవీ చూసిన తాము షాక్ కు గురయ్యమన్నారు ఆకాష్.

ఇదే విషయంపై పూరి జగన్నాధ్ ను కలవాలని ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి.. ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ చెప్పారు. తన దగ్గర ఉన్న ఆధారాలను మీడియా ముందు ఉంచారు ఆకాష్. ఈ మూవీపై  లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తాను వెనకాడబోనని స్పష్టం చేశారు.

Latest Updates