రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

రన్ టైమ్: 2 గంటల 25 నిమిషాలు

నటీనటులు: రామ్,నభా నటేష్,నిధి అగర్వాల్,సత్యదేవ్,షియాజీ షిండే,పునీత్ ఇస్సార్,అశిష్ విద్యార్థి తదితరులు

మ్యూజిక్: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఎడిటింగ్ : జునైద్

నిర్మాతలు: పూరీ జగన్నాథ్,చార్మి కౌర్

రచన,దర్శకత్వం: పూరీ జగన్నాథ్

రిలీజ్ డేట్: జులై 18,2019

కథేంటి:

శంకర్ (రామ్) హైదరాబాద్ లో చోటా మోట క్రిమినల్.చిన్న సైజ్ సెటిల్ మెంట్లు చేస్తూ వుంటాడు.ఓ పెద్ద వ్యక్తిని మర్డర్ చేస్తే ఎక్కువ మొత్తం ఇస్తామని చెబితే..ముందూ వెనకా ఆలోచించకుండా ఆయన్ని చంపేస్తాడు.తర్వాత తను ఎదుర్కున్న సమస్యలేంటి..చనిపోయిన అతను ఎవరు?ఆ చావు వెనక ఎవరున్నారనేది కథ..

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.డాన్సులు,ఫైట్స్ తో కుమ్మేసాడు..తను మాట్లాడిన తెలంగాణ స్లాంగ్ మాత్రం బాగాలేదు. న్యాచురల్ గా కాకుండా బలవంతంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది.హీరోయిన్ నభా నటేష్ కు మంచి పాత్ర దక్కింది.తెలంగాణ అమ్మాయి పాత్రలో యూత్ ను ఉర్రూతలూగిస్తుంది.నిధి అగర్వాల్ గ్లామర్ ఒలకబోసింది.సిబిఐ ఆఫీసర్ పాత్రలో సత్యదేవ్ మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. షియాజీ షిండే, పునీత్ ఇస్సార్, అశిష్ విద్యార్థి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్:
టెక్నిషీయన్ లల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణిశర్మ గురించి.తన మ్యూజిక్ తో సినిమా కు ప్రధాన బలం చేకూర్చాడు.పాటల్లో మూడు పాటలు చాలా బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సాదాసీదా సీన్లను కూడా బాగా ఎలివేట్ చేశాడు.రాజ్ తోట సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా ఉంది.డాన్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగా కుదరింది.ఎడిటింగ్ బాగుంది.ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. పూరీ మార్క్ డైలాగులు కొన్ని బాగా పేలాయి.

విశ్లేషణ:
‘‘ఇస్మార్ట్ శంకర్’’ ఎనర్జిటిక్ మాస్ ఎంటర్ టైనర్.. పూరీ లాంటి డైరెక్టర్ కు ఫుల్ ఎనర్జీ ఉన్న హీరో దొరికితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.నిజానికి పూరీ స్క్రిప్టును రామ్ తన భుజాలమీదేసుకొని సినిమాను నడిపించనట్టుటుంది ఇస్మార్ట్ శంకర్ మూవీ..పూరీ జగన్నాథ్ గత సినిమాలతో పోలిస్తే పెద్దగా ఇంప్రూవ్ అయిందేమి లేదు కానీ..ఈ నార్మల్ స్క్రిప్లుకు రామ్ లాంటి హీరో దొరకడం వల్ల సినిమాకు బాగా ప్లస్ అయింది.చిప్ డాటా ట్రాన్స్ ఫర్ అనేది కొత్త పాయింట్..దానిని ఇలాంటి మాస్ సినిమాకు వాడుకోవడం మంచి ఐడియా.ఆ ఒక్కటి తప్పిస్తే..పూరీ రైటర్ గా పెద్దగా ఇంప్రెస్ చేసిందేమి లేదు.స్క్రీన్ ప్లే వీక్ గా ఉంది. లవ్ ట్రాక్ కూడా కన్సీన్సింగ్ గా లేదు..చిన్న లవ్ ట్రాక్ తోనే ఎంతో ఎమోషన్ ఉన్నట్టు చూపించారు.ఇక చిప్ డాటా ట్రాన్స్ ఫర్ సీన్ కూడా ఎఫెక్టివ్ గా లేదు.సింపుల్ గా తేల్చేసారు.లాజిక్ లు కొన్ని పక్కనపెడితే మాస్ యూత్ మాత్రం ఎంజాయ్ చేసే లక్షణాలున్న సినిమా ఇది.రామ్ పర్ఫార్మెన్స్,డైలాగులు,హీరియిన్ల గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను నిలబెట్టాయని చెప్పొచ్చు.ఓవరాల్ గా ‘‘ఇస్మార్ట్ శంకర్’’ పక్కా మాస్ ఎంటర్ టైనర్.మాస్ ఎంటర్ టైనర్ వచ్చి చాలా రోజులైంది కనుక యూత్ ఓసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు..

Latest Updates