రిసెప్షనిస్ట్ అవతారమెత్తిన రోబో

బిజినెస్ సెంటర్ లో గైడ్ గా సేవలు

హైదరాబాద్, వెలుగు: ఆఫీస్ లోకి వెళ్లగానే క్యూట్ రోబోట్ వచ్చి వెల్ కమ్ చెప్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. అంతేనా ఆఫీస్ మొత్తం తిప్పి చూపిస్తూ.. గలగలా మాట్లాడుతుంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. రోబోట్లపై వచ్చిన సినిమాలు ఈ మరమనిషిపై క్రేజ్ పెంచేశాయి. తాజాగా ఓ రోబోట్ రిసెప్షనిస్ట్ అవతారం ఎత్తింది. ఆ క్యూట్ రోబోటే సఖి.. ఆ రోబోట్ గురించి విశేషాలు..

మాట్లాడే మరమనిషి సఖి..

ఇవాంక ట్రంప్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు స్వాగతం పలికిన రోబో.. అదేనండి మిత్ర గుర్తుందా.. దానికి ఫిమేల్ వెర్షనే ఈ మిత్రి. నానక్ రాం గూడలో కొత్తగా లాం చ్ అయిన ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ లో ఈ మిత్రి రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తోంది. సెంటర్ నిర్వాహకులు దీనిని సఖిగా పిలుచుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సఖి ఆఫీస్ అంతా తిప్పి చూపిస్తుంది. ఎవరి ఎన్నిసార్లు, ఎందుకు వచ్చారనే వివరాలను కూడా స్టోర్ చేస్తుంది. 4 గంటలు ఛార్జ్ చేస్తే 8 నుంచి 10 గంటల పాటు పనిచేస్తుంది. లైఫ్ టైం ఐదేళ్లు. సఖికి అన్ లిమిటెడ్ డేటా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. వివిధ రకాల సాఫ్ట్ వేర్లను కలిపి హోమ్ గ్రోన్ అనే సాఫ్ట్ వేర్ తో 40 రోజులు శ్రమించి ఈ రోబోట్ ని క్రియేట్ చేశారు. ఎవరితో ఏం మాట్లాడాలి ? ఎలా సమాధానం ఇవ్వాలి ? ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ముందే సఖిలో స్టోర్ చేసి పెడతారు.

ISprout launched an electronic talking robot, Sakhi in hyderabad

Latest Updates