రియల్ ఫ్రెండ్ : ఇండియాకు ఇజ్రాయెల్ బేషరతు మద్దతు

ఢిల్లీ : పాకిస్థాన్ ను ప్రపంచంలో పటంలో ఒంటరిగా నిలబెట్టే ప్రయత్నంలో భారత్ కు గట్టి మద్దతు లభించింది. శక్తిమంతమైన, నమ్మకైన మిత్రదేశం ఇజ్రాయెల్…. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి షరతుల్లేకుండా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. మనదేశంతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఇజ్రాయెల్…. పుల్వామా ఉగ్రదాడి తర్వాత.. తనను తాను రక్షించుకోవాలనుకుంటున్న భారత్ కు అన్ కండిషనల్ సపోర్ట్ ప్రకటించింది.

“మేం అత్యంత రక్షణాత్మక ప్రపంచాన్ని కోరుకుంటున్నాం.. అందుకే ఉగ్రవాదంపై పోరాటంలో మా క్లోజ్ ఫ్రెండ్ భారతదేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇండియాకు ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన అంశాలపై సలహాలిస్తాం. మా టెక్నిక్ ను కూడా అందిస్తాం. ఎందుకంటే ఇండియా మాకు ఇంపార్టెంట్ ఫ్రెండ్. మా నిజమైన ఫ్రెండ్ కు నిజంగా సాయం చేయాలనుకుంటున్నాం ” అని తెలిపారు ఇజ్రాయెల్ అంబాసిడర్ డాక్టర్ రోన్ మల్కా. ఇంత చేస్తాం.. అంత చేస్తాం అని కాదు… ఉగ్రవాదంపై చేసే పోరులో…. పరిమితులు లేని మద్దతు, సహాయం అందిస్తామని తెలిపారు. ఇండియా ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కొత్తగా ఇజ్రాయెల్ అంబాసిడర్ గా నియమితులైన రోన్ మాల్కా చెప్పారు.

ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. శత్రువులను అణగదొక్కాలన్నా ఇజ్రాయెల్ రూటే వేరు. టెక్నిక్ లో దాని లెక్కలే వేరు. ఆ దేశపు యుద్ధ వ్యూహాలు ఇప్పటికీ నివ్వెరపరిచేవే. ఇదే తరహాలోనే ఉగ్రవాద శత్రువులపై భారత్ దాడిచేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్న ఈ సమయంలో.. ఇజ్రాయెల్ అన్ కండిషనల్ సపోర్ట్ ను ఇండియాకు ప్రకటించడం ఆసక్తి పెంచుతోంది.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహు ఇద్దరు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కొన్నాళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేశారు.  ఇజ్రాయెల్.. ఇండియాకు ఆత్మబంధువులాంటిదని ప్రధాని గతంలోనూ పలుమార్లు చెప్పారు.

Latest Updates