కరోనావైరస్ ను చంపే ఛార్జింగ్ మాస్క్

ప్రస్తుతం కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ వైరస్ ను ఛార్జింగ్ మాస్క్ తో చంపొచ్చని అంటున్నారు ఇజ్రాయెల్ పరిశోధకులు. మాస్క్ కు ఫోన్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టినప్పుడు మాస్క్ వేడి చెంది కరోనావైరస్ చనిపోతుందని వారంటున్నారు. హైఫాలోని టెక్నియన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక బృందం యూఎస్‌బి పోర్టుతో ఉండే మాస్కును తయారుచేసింది. ఆ పోర్టుకు మొబైల్ ఫోన్ ఛార్జర్‌ను అనుసంధానించి 30 నిమిషాలు ఛార్జింగ్ పెడితే ఆ వేడికి మాస్కులోని క్రిములన్నీ చనిపోతాయట. ఛార్జర్ మాస్కులోని కార్బన్ ఫైబర్స్ యొక్క పొరను 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది.

రీయూజబుల్ మాస్కులను వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని మరియు వినియోగదారులకు ఆర్థికంగా కూడా లాభమని శాస్త్రవేత్త యైర్ ఐన్-ఎలి తెలిపారు. దీనికి సంబంధించిన పేటెంట్ రైట్స్ కోసం పరిశోధకులు మార్చి చివరలో దరఖాస్తు చేసుకున్నారు.

For More News..

ఫుట్ ఫాత్ ల‌ను ఆక్ర‌మిస్తే క‌ఠిన‌ చ‌ర్య‌లు

Latest Updates