చంద్రయాన్-2 ప్రయోగానికి డేట్ ఫిక్స్

isro-has-firmed-up-that-chandrayaan-2-mission-will-be-launched-date-fix

శ్రీహరికోట: 13 ఉపగ్రహాలను ఆకాశంలోకి తీసుకెళ్లే ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-2. ఈ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెడీ అవుతోంది. ప్రయోగానికి సంబంధించిన తేదీలను కూడా కన్ఫమ్ చేసింది ఇస్రో. జులై 15న వేకువజామున 2.51 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇస్రో రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని.. 13 ఉపగ్రహాలను చంద్రయాన్‌ 2 నింగిలోకి మోసుకెళ్లనుందన్నారు. దీని మొత్తం బరువు 3.8 టన్నులు ఉంటుందని తెలిపారు ఇస్రో అధికారులు.

Latest Updates