నవంబర్ 25న కార్టోశాట్‌-3 ప్రయోగం: ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 25వ తేదీన కార్టోశాట్‌-3ను ప్రయోగించనున్నది. అమెరికాకు చెందిన 13 వాణిజ్యపరమైన నానో శాటిలైట్స్‌ను కార్టోశాట్‌-3తో పాటు అంతరిక్షంలోకి పంపనున్నది. PSLV-C47 రాకెట్‌ ద్వారా ఈ శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ నెల 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ-47 నింగిలోకి దూస్కెళ్లనుంది. కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల ఫొటోలను ఈ శాటిలైట్ తీస్తుంది.

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు చెప్పింది.

Latest Updates