విక్రమ్ ఇలా దిగుతుంది.. రోవర్ అలా తిరుగుతుంది

ఇస్రో చేస్తున్న ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 2 ప్రయోగంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ అర్ధరాత్రి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగేందుకు దిగబోతోంది. అర్ధరాత్రి ఒంటి గంట 30 నిమిషాల నుంచి రెండు గంటల 30 నిమిషాల మధ్య చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. ల్యాండర్ లో ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 మధ్య విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చి ఉపరితలంపై దిగుతుంది.

రాత్రి 1 గంట తర్వాత.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంవైపుకు కదులుతుంది. సెకనుకు 2 మీటర్లకు చొప్పున దిగుతూ.. ఉపరితలాన్ని తాకుతుంది. 1 గంట 40 నిమిషాల నుంచి 1 గంట 55 నిమిషాల మధ్య అంటే.. 15 నిమిషాల పాటు ఈ ల్యాండింగ్  ప్రక్రియ జరగనుంది. 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే చంద్రుడిపై విక్రమ్  ల్యాండర్  దిగే 15 నిమిషాలు మరో ఎత్తు. ఇది సక్సెస్ అయితే.. చంద్రుడిపై ఇంతవరకు ఎవరూ దిగని ప్రాంతంలో చంద్రయాన్ 2 దిగినట్టే. సరికొత్త చరిత్ర మన ఇస్రో సొంతం అవుతుంది.

విక్రమ్  ల్యాండర్ ను జాబిల్లిపైకి విజయవంతంగా చేర్చిన తర్వాత….ప్రజ్ఞాన్  రోవర్ … 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.  ఆ టైంలో అది విక్రమ్ నుంచి 500 మీటర్ల దూరం వెళ్తుంది.

విక్రమ్ ల్యాండింగ్.. ప్రజ్ఞాన్ రోవర్ చేసే పనులతో ఇస్రో వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి విడుదల చేసింది. చంద్రయాన్-2 ల్యాండింగ్ ప్రక్రియను ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 60 మంది విద్యార్థులు బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రత్యక్షంగా చూస్తారు.

Latest Updates