
మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగినట్లు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 23, 2017న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో తనపై విష ప్రయోగం జరిపారని ఆయన అన్నారు. భోజన సమయంలో తాను తీసుకున్న దోశ, చట్నీలలో ప్రాణాంతకమైన ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్ విషం కలిపారని ఆయన ఆరోపించారు.
ఈ విషయం గురించి మిశ్రా.. ‘లాంగ్ కెప్ట్ సీక్రెట్’ అనే టైటిల్‌తో తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. తనపై విష ప్రయోగం జరిగిన సమయంలో.. హోం వ్యవహారాల భద్రతా సిబ్బంది తనను కలిసి హెచ్చరించారని ఆయన అన్నారు. అందువల్లే తనకు చికిత్స సులభమైందని ఆయన తెలిపారు. ఈ విష ప్రయోగం వల్ల తనకు శ్వాస ఇబ్బంది, చర్మ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకాయని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అందుకోసం వైద్యం చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. గూఢాచర్యంలో భాగంగానే తనపై ఈ విషప్రయోగం జరిగిందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. కాగా.. మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై ఇస్రో ఇంకా స్పందించలేదు.
మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారునిగా పనిచేస్తున్నారు. ఆయన ఈ నెల చివరిలో తన పదవి నుంచి రిటైర్ కానున్నారు. కాగా.. ఆయన అంతకుముందు అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌కు (ఇస్రో) డైరెక్టర్‌గా పనిచేశారు.
For More News..