చంద్రయాన్​ 2 వెలుగుల జాబిలి ఇది

వెలుగుల జాబిలిని  చంద్రయాన్​2 ఆర్బిటర్​ క్లిక్​మనిపించింది. కొద్ది రోజుల క్రితం చీకటి చంద్రుడిని కెమెరా లెన్సుల్లో దాచిన ఆర్బిటర్​.. ఇప్పుడు తొలిసారి సూర్యుడి కాంతితో వెలిగిపోతున్న జాబిలిని ఒడిసి పట్టింది. ఆర్బిటర్​లోని ఇమేజింగ్​ ఇన్​ఫ్రారెడ్​ స్పెక్ట్రోమీటర్​ (ఐఐఆర్​ఎస్​) ఆ ఫొటోలను తీసింది. జాబిలిపై ఉన్న పాత, కొత్త లోయలను చూపించింది. చందమామపై పడిన సూర్యుడి కాంతిని లెక్కగట్టింది. సూర్యుడి కాంతి పరావర్తన (రిఫ్లెక్షన్​) లెక్కల ఆధారంగా చంద్రుడిలోని ఖనిజాలు, మూలకాలను గుర్తించడానికి వీలుగా ఐఐఆర్​ఎస్​ను ఆర్బిటర్​లో పెట్టి పంపింది ఇస్రో. ఇప్పటికే తెలిసిన సోమర్​ఫీల్డ్​, స్టెబిన్స్​, కర్క్​వుడ్​ లోయలతో పాటు ఆ లోయల్లోనే ఏర్పడిన కొన్ని కొత్త లోయలనూ ఐఐఆర్‌‌ఎస్‌‌ గుర్తించింది.

 

వెలుగు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates