చంద్రయాన్2 ఆర్బిటర్ తో చాలా పనుంది

విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కమిటీ

విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సేఫ్ ల్యాండింగ్ కాకపోయినప్పటికీ.. చంద్రయాన్2 మిషన్ ఆగిపోలేదు. ఇస్రో చేసిన తాజా ప్రకటన అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. చంద్రయాన్ 2 లక్ష్యాలు అందుకోవడానికి , సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి నిరంతరం కృషి జరుగుతూనే ఉంటుందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో తెలిపింది.

“ఇప్పటికే షెడ్యూల్ చేసిన సైన్స్ ప్రయోగాలను పూర్తిచేయడానికి చంద్రయాన్2 ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూనే ఉంటుంది. ఆర్బిటర్ లోని పేలోడ్స్ అన్నింటికీ శక్తి అందించాం. ఆర్బిటర్ పేలోడ్స్ తో ప్రాథమిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆర్బిటర్ లోని అన్ని పేలోడ్స్ ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. చంద్రయాన్2 తో సంతృప్తికర ఫలితాలు సాధించేలా.. ఆర్బిటర్ మరిన్ని సైన్స్ ప్రయోగాలు చేస్తుంది” అని ఇస్రో ప్రకటించింది.

విక్రమ్ ల్యాండర్ తో ఆర్బిటర్ , ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు కమ్యూనికేషన్ తెగిపోవడంపై శాస్త్రవేత్తలు, నిపుణులతో ఓ కమిటీని వేసింది భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ. ఇస్రో నిపుణులు, విద్యావేత్తలతో జాతీయస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ.. విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు ఎందుకు తెగిపోయాయన్నదానిపై పరిశోధనలు చేస్తారని ఇస్రో తెలిపింది.

Latest Updates