ఇస్రో వైపు అమెరికా కంపెనీల చూపు

  • అమెరికా కంపెనీ స్పేస్‌ఫ్లైట్‌తో డీల్‌

శాటిలైట్లను చాలా తక్కువ ఖర్చుతోనే అంతరిక్షానికి పంపాలంటే ఏ అంతరిక్ష సంస్థ  బెటర్? స్పేస్​ప్రయోగాల కోసం రాకెట్లను వాడుకోవాలంటే ప్రపంచంలోనే చీప్ ​అండ్ ​బెస్ట్ ​కంపెనీ ఏది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. అదే మన ఇస్రో! అందుకే ఇప్పుడు అమెరికా కంపెనీలు ఇస్రో వైపు చూస్తున్నాయి. ఇస్రో కొత్తగా ప్రారంభించిన న్యూ స్పేస్ ​ఇండియా లిమిటెడ్​(ఎన్ఎస్ఐఎల్)కు నెల తిరగకుండానే ఓ కాంట్రాక్టు కూడా లభించింది. అది కూడా ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న  స్మాల్ ​శాటిలైట్ ​లాంచ్ ​వెహికిల్​(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపేందుకు డీల్ ​కుదిరింది. ‘అమెరికాకు చెందిన ఓ కస్టమర్​కోసం’ ఒక స్పేస్​క్రాఫ్ట్​ను అంతరిక్షానికి పంపేందుకు మేం ఒప్పందం చేసుకున్నాం. ఈ స్పేస్​క్రాఫ్ట్​ను ఇస్రో డెవలప్​ చేస్తున్న ఎస్ఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించేందుకు ఎన్ఎస్ఐఎల్​తో కూడా డీల్ ​కుదుర్చుకున్నామని స్పేస్​ఫ్లైట్ అనే అమెరికా కంపెనీ ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ తొలి ప్రయోగాత్మక పరీక్షను పోయిన నెలలోనే చేపట్టాల్సి ఉన్నా, అది ఈ ఏడాది చివరికి వాయిదా పడింది. వచ్చే ఏడాది చేపట్టే రెండో డెవలప్‌‌మెంటల్​ లాంచ్​లో స్పేస్​ఫ్లైట్ ​శాటిలైట్​ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.

ఎస్ఎస్ఎల్వీ ప్రత్యేకతలు ఇవే..

ఈ రాకెట్​500 కిలోల వరకు బరువు ఉండే శాటిలైట్లను లో ఎర్త్​ ఆర్బిట్​కు చేరుస్తుంది. రాకెట్​బరువు 110 టన్నులు. ఆరుగురు సిబ్బంది 72 గంటల్లోనే అసెంబుల్​ చేయవచ్చు. ఖర్చు కేవలం రూ. 30 కోట్లు. దీనికి మనదేశంలోనే ఏటా 15 నుంచి 20 ఎస్ఎస్ఎల్వీల తయారీకి డిమాండ్​ ఉంటుందని అంచనా. ఇస్రో తయారుచేస్తున్న ఎస్ఎస్ఎల్వీ రాకెట్​ ద్వారా ఒకేసారి ఎక్కువ మైక్రోశాటిలైట్లను ప్రయోగించొచ్చని స్పేస్​ఫ్లైట్​ కంపెనీ ప్రెసిడెంట్​ కర్ట్​బ్లేక్ చెప్పారు. ఈ రాకెట్​ఆ శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లోకి కూడా విడిచిపెట్టగలదన్నారు. మొదట లో ఎర్త్​ ఆర్బిట్​లోకి,  2020 నుంచి సన్ ​సింక్రనస్​ ఆర్బిట్‌‌లోకి ఉపగ్రహాలు పంపించాలని భావిస్తున్నామన్నారు. చిన్న చిన్న శాటిలైట్లను మినీ రాకెట్ల ద్వారా ఒకేసారి అంతరిక్షానికి పంపడం వల్ల చాలా లాభాలున్నాయని ఎన్ఎస్ఐఎల్​ డైరెక్టర్​ డి. రాధాకృష్ణన్‌‌ చెప్పారు. దీనివల్ల స్పేస్​ఫ్లైట్​తో మరిన్ని డీల్స్​ కుదురుతాయన్నారు. మరిన్ని విదేశీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ముందుకు వస్తాయన్నారు

Latest Updates