పీఎస్ఎల్వీ కొత్త వెర్షన్ రాకెట్ తో నేడే ప్రయోగం

ISRO'S PSLV-C45 EMISAT LAUNCHING TODAY

శత్రు దేశాల ఎత్తుల్ని చిత్తు చేసే అత్యాధునిక స్పైశాటిలైట్ ‘ఎమిశాట్‌‌’ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఇస్రో గెలుపు గుర్రం పీఎస్ ఎల్వీ సీ45 సోమవారం ఉదయం 9.27 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఎమిశాట్ ను నింగిలోకి తీసుకెళ్లనుంది.దీనితో పాటు మరో 28 నానో శాటిలైట్స్ ను కూడా ఇస్రో నిర్ణీత మూడు కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. ఇలా చేయడం ఇస్రోకిదే తొలిసారి. కొత్తగా డెవలప్ చేసిన పీఎస్ఎల్వీ–క్యూఎల్ మోడల్ ను ఈ ప్రయోగం కోసం వాడుతున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ రాకెట్ లో తొలిస్టేజ్ లో నాలుగు స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయని వివరించిం ది. 436 కిలోల బరువున్న ఎమిశాట్ నురోదసిలో 763 కి.మీ.ల కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించిం ది. ఆ తర్వాత నాలుగో స్టేజ్ ను మళ్లీమండించి అమెరికా, లూథియానా, స్పె యిన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన నానో శాటిలైట్స్ తో పాటు,మూడు ఎక్స్‌‌పెరిమెం టల్ పేలోడ్లను నిర్ణీత కక్ష్యల్లోకివదులుతామని చెప్పింది.

శత్రు దేశాల రాడార్లను పసిగట్టడం, ఇంటెలిజెన్స్,కమ్యూనికేషన్, హై రిజల్యూషన్ చిత్రాలను సేకరించేం దుకు ఎమిశాట్ ఉపయోగపడుతుం ది.ముఖ్యం గా పాకిస్థా న్ దురాగతాల్ని ముం దే పసిగట్టేం-దుకు, వారి కదలికలపై డేగ కన్ను వేసేం దుకు దోహదపడుతుంది. గతంలో శత్రు దేశాల ఆయుధ సంపత్తి, సైనికుల కదలికల్ని తెలుసుకునేందుకు డ్రోన్లు, ఏరోస్టార్లు , హీలియం బెలూన్లను వాడే వాళ్లని రక్షణ రంగ నిపుణుడు రవి గుప్తా చెప్పారు. ప్రస్తుతం శాటిలైట్స్ నిరంతరం ఆ పని చేస్తున్నాయని అన్నారు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో సెల్‌‌ఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాలు ఎన్ని పని చేస్తున్నాయనే విషయాలను కూడా ఇవి అందిస్తాయని చెప్పారు. ఇటీవల పాకిస్థాన్ లోని బాలాకోట్‌‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంలో 300 సెల్‌‌ఫోన్లు యాక్టివ్‌ గా పనిచేస్తున్నట్లు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌‌టీఆర్వో) చెప్పి న తర్వాతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడులు చేసిందని ఆయన గుర్తు చేశారు.

Latest Updates