కర్ణాటక మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

కర్ణాటకలో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాలు, హసన్, మాండ్యా, మైసూరులో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి పుట్టరాజు నివాసం మాండ్యాలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు హసన్ లోని 17 మంది కాంట్రాక్టర్లు, ఏడుగురు అధికారుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. సాగునీటిపారుదల శాఖ, PWD శాఖలకు చెందిన కాంట్రాక్టర్లు, అధికారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేస్తోంది. కర్ణాటక సీఎం కుమార స్వామి ఐటీ దాడులు జరుగుతాయని చెప్పిన మరుసటి రోజే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 2 వందల నుంచి 3 వందల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బెంగళూరు తరలించారని, జేడీఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతాయని పక్కా సమాచారం ఉందని కుమార స్వామి నిన్న మాండ్యాలో చెప్పారు. అన్నట్లుగానే ఇవాళ(గురువారం) సోదాలు కొనసాగుతున్నాయి.

Latest Updates