ఇవాళ్టి నుంచి ఐటీ కంపెనీలు ఓపెన్

హైదరాబాద్, వెలుగుకరోనా లాక్‌‌డౌన్‌‌ ఆంక్షల నుంచి ఐటీ కంపెనీలకు సడలింపులు దక్కుతున్నాయి. 33 శాతం వర్క్ ఫోర్స్‌‌ తో హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. రష్‌‌ లేకుండా మెల్లమెల్లగా ఆపరేషన్స్ ను ప్రారంభించుకోవచ్చని చెప్పారు. అన్ని షిఫ్ట్‌‌ ల్లో కూడా 33 శాతం వర్క్ ఫోర్స్ మాత్రమే పనిచేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆఫీసుల్లో ఉద్యోగులు లాగిన్ ఉదయం 7 గంటలకు, 10 గంటలకు అయితే, సాయంత్రం 3 గంటలు, 6 గంటల కల్లా లాగౌట్ కావాలని సూచించారు.  రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.  సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌‌‌‌తో ఇండస్ట్రీ బాడీలు ఏఎస్‌‌సీఎస్‌‌సీ, హైసియా, నాస్కామ్‌‌, ఐటీ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఐటీ సెక్టార్‌‌‌‌కు ఈ గైడ్‌‌లైన్స్ ను జారీ చేశారు. ఉద్యోగులకు, క్యాబ్‌‌లకు ఇచ్చే అథరైజేషన్ లెటర్లను కేవలం ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి మాత్రమే వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఎంప్లాయీ కంపెనీ ఐడీ కార్డుతో పాటు అథారిటీ లెటర్‌‌‌‌ను కూడా క్యారీ చేయాలని చెప్పారు. రోడ్లపై ఇండివిడ్యువల్ వెహికిల్స్ ను తగ్గించడానికి కంపెనీలు మ్యాక్సిమమ్ బస్సులనే వాడాలని పోలీసులు సూచించారు.

కెఫెటేరియా తెరవద్దు…

సేఫ్టీ విషయంలో తెలంగాణ హెల్త్ డిపార్ట్‌‌ మెంట్ జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌ ను కంపెనీలు తప్పనిసరిగా పాటించాలి. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను ఉద్యోగులు వాడే అన్ని వెహికిల్స్‌‌ కు కూడా వర్తింపజేస్తున్నారు. క్యాబ్‌‌ల్లో డ్రైవర్‌‌‌‌తో పాటు ఇద్దరు ప్యాసెంజర్లే ఉండాలి. టూవీలర్స్‌‌ కు అనుమతించడం లేదు. ఉద్యోగుల సీటింగ్ అరేంజ్‌‌మెంట్ల మధ్య కూడా ఆరు అడుగుల దూరం ఉండాలి. కంపెనీ బస్సులు కూడా 50 శాతం అక్యుపెన్సీతోనే నడవాలి. ఐటీ పార్క్‌‌ లు, క్యాంపస్‌‌ల బయట ఉద్యోగులు మీటింగ్‌‌లు పెట్టడానికి వీలు లేదు. రోడ్లపై గుంపులు గుంపులుగా తిరగకూడదు. ఆఫీసుల్లో కెఫేటేరియా నడవడానికి వీలులేదు. ఐటీ కంపెనీల్లో, ఐటీ పార్క్ ల్లో కూడా సోషల్ గేదరింగ్‌‌లు ఉండకూడదు. ఈ నిబంధనలన్నింటిన్నీ హైదరాబాద్ ఐటీ కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలోని 1500 కంపెనీల్లో ఆరు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మన ఐటీ ఇండస్ట్రీ నుంచే ప్రతి ఏడాది రూ. లక్ష కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి.

ఇవాల్టి నుంచి హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీ లు 33 శాతం ఉద్యోగులతో ఆఫీసులను తిరిగి ప్రారంభించుకునేలా అనుమతిస్తు న్నాం. అయితే సేఫ్టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదు రకాల సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి కంపెనీ గేటు దగ్గర ఉద్యోగి టెంపరేచర్ చెక్ చేయాలి. ఉద్యోగులు మాస్క్ లు తప్పనిసరి గా ధరించాలి. సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి. 55 వయ సు దాటిన వారికి ఆఫీసులకు అనుమతి లేదు. కంపెనీ క్యాంటిన్లు కూడా క్లోజ్ ఉండా లి. ఉద్యోగుల టేబుల్ వద్దనే లంచ్ అరేంజ్‌‌ మెంట్లు చేయాలి. కరోనా వల్ల ఇబ్బంది పడుతోన్న చిన్న ఐటీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తుందని చూస్తు న్నాం. కేంద్ర ప్రభుత్వ ప్యాకే జీ మేరకు రాష్ట్ర స్థా యిలో కూడా ఉంటుంది. లాక్‌‌డౌన్‌‌ తో ఐటీ కంపెనీల్లో ఎలాంటి లేఆఫ్స్ లేవు.

– జయేష్ రంజన్, తెలంగాణ ఐటీ సెక్రటరీ

Latest Updates