శాడిజంలో అన్నకంటే చెల్లెలు రెండు ఆకులు ఎక్కువే చదివిందా..?

కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరనే ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంది.

కొద్దిరోజుల నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏప్రిల్ 15న కిమ్ జోంగ్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ప్రతీఏడు తాత జయంతి ఉత్సవాలకు హాజరయ్యే కిమ్…ఈసారి మాత్రం అటెండ్ కాలేదు. అప్పటి నుంచి కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని లేదు చనిపోయాడని, కిమ్ తరువాత ఆయన చెల్లెలు కిమ్ యో-జోంగ్ పదవీ బాధ్యలు చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిగ్గా మారాయి. తాజాగా కిమ్ ఆరోగ్యంగా ఉన్నారని ఆదేశ ప్రభుత్వ మీడియా తెలిపింది.

ఇక కిమ్ మరణించారా..? లేదా అనారోగ్యంతో బాధపడుతున్నారా…? అనే విషయం అటుంచితే..కిమ్ మరణిస్తే ఉత్తరకొరియా ను ఎవరు పాలిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో కిమ్ చెల్లెలు కిమ్ యో-జోంగ్ బాధ్యతలు చేపడతారని చర్చలు నడుస్తున్నాయి. అంతేకాదు శాడిజంలో అన్న కిమ్ కంటే చెల్లెలు జోంగ్ రెండు ఆకులు ఎక్కువే చదివారంటూ గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుంటున్నారు.

పరిపాలన విభాగంలో కిమ్ తన చెల్లెలు జోంగ్ సలహాలు తీసుకుంటుంటారు. ఆయన రోజూవారీ షెడ్యూల్ చూసుకుంటుంది. మీడియా సమావేశాల్లో కిమ్ తత్తర పాటు గురైన సమయాల్లో కవర్ చేసి అండగా నిలిచారు.

హనోయిలో కిమ్ జాంగ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భేటీ సమయంలో వాళ్లిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తొంగిచూడడం అప్పట్లో హాట్ టాపిగ్గా మారింది. నియంతలాంటి కిమ్ కు సలహాలు ఇస్తున్నారంటే ఆయన చెల్లెలు ఇంకెంత శాడిజం చూపిస్తారోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆర్జీవీ సైతం

కిమ్ చెల్లెలు కిమ్ యో-జోంగ్ ఉత్తర కొరియా అధ్యక్షురాలి బాధ్యతలు చేపడతారన్న రూమర్స్ పై డైరెక్టర్ ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించారు. జోంగ్ అధ్యక్షురాలి బాధ్యతలు చేపడతారని, అదే జరిగితే ఆమె అతడి కంటే మరింత క్రూరురాలు అయితే… ఈ ప్రపంచం మొదటి ఆడ విలన్‌ను చూస్తుంది అని వర్మ ట్వీట్‌ చేశారు.

Latest Updates