కరోనా కిట్లలో కుంభకోణానికి పాల్పడటం సిగ్గుచేటు

న్యూఢిల్లీ : ఓ వైపు దేశమంతా కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తుంటే ఇలాంటి సందర్భంలో కుంభకోణాలకు పాల్పడతారా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపించారు. వాస్తవ ధర కన్నా 145 శాతం అధిక రేట్లకు కిట్లను కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతుంటే ఈ సమయంలో లాభాల గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని మోడీ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ” కరోనా కిట్ల స్కాం గురించి తెలిసి ప్రతి ఇండియన్ సిగ్గుపడుతున్నాడు. ఈ సమయంలో ప్రతి భారతీయున్ని అవమానించేలా స్కాం కు పాల్పడ్డారు. స్కామ్ కు పాల్పడ్డవారని శిక్షించాలని ప్రధాని మోడీని అభ్యర్థిస్తున్నా” అని రాహుల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Latest Updates