రాబోయేది నా పాలన కాదు…మన పాలన

రాబోయేది ఎన్నికలు కాదు.. ధర్మానికి.. అధర్మానికి మధ్య జరుగుతున్నయుద్ధమన్నారు YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచార ర్యాలీలో జగన్ మాట్లాడారు. మాటలతో పచ్చి మోసం చేసే చంద్రబాబు అడుగడునా మోసమే చేస్తున్నారన్నారు. ఒక్కో పథకంతో ఒక్కో వర్గాన్ని మోసం చేసే చంద్రబాబు ఆడపడుచులను, రైతులను, వృద్ధులను మోసంతో తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.YCP తమ్ముళ్ళంతా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి చంద్రబాబు మోసాలను బయటపెట్టాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వలకు జగన్ అన్న ఇచ్చే నవరత్నాల గురించి వివరించాలని కోరారు. విశ్వాసానికి చిరునామా అయిన వైసీపీతో బతుకులు బాగుపడతాయని….రాబోయేది నా పాలన కాదు మన పాలన అవుతుందన్నారు.

చంద్రబాబు పార్టనర్.. యాక్టర్ ఆ పవన్ కల్యాణే అన్నారు జగన్. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను YCPకి దక్కకుండా చేయడానికే చంద్రబాబు… పవన్ ను రంగంలోకి దించారని ఆరోపించారు. బాబు ఏం చెబితే అదే పవన్ మాట్లాడతారని.. చంద్రబాబు ఎలా చెబితే అలానే నడుచుకుంటారని.. చంద్రబాబు చెప్పిన వాళ్లకే ఆ యాక్టర్ టికెట్లు కూడా ఇచ్చాడని.. ఆఖరికి జనసేన నామినేషన్లలో కూడా టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయన్నారు. బహిరంగంగా పొత్తుపెట్టుకుంటే టీడీపీతో పాటు జనసేనకు కూడా డిపాజిట్లు కూడా రావని అందుకే ఇలా కుట్రల ముసుగులో ఉండిపోతున్నారన్నారు. జనసేన ఒక్కరే కాదు కొత్త కొత్త పార్టీలను బాబు చాలా ముందుకు తెచ్చాడన్నారు. వైసీపీ జెండాలను, కండువాలను, గుర్తులను పోలిఉండేలా పార్టీలను తెచ్చి వారికీ ఆర్ధికంగా బాబే సహాయం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్.

Latest Updates